Site icon HashtagU Telugu

Centre On Omicron: ఓమిక్రాన్ పై ప్రజల ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు

Omicron

Omicron

పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే సూచనలు, రాష్ట్రాల నిర్ణయాలు ఇవన్నీ గమనిస్తే కరోనా ఇండియాని మరోసారి షేక్ చేసేలాగే కన్పిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను సూపర్ స్ట్రెయిన్ గా ట్రీట్ చేసాక, దేశంలోని ప్రజలకు తలెత్తుతున్న పలు ప్రశ్నలకు కేంద్రం సమాధానమిస్తొంది.
ఒమిక్రాన్ ఇబ్బంది పెట్టె స్ట్రెయిన్ అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్రం తెలిపింది. ప్రజలందరూ టీకా వేసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో నిఘా పెంచి విదేశాలనుండి వస్తోన్న వాళ్ళకి ప్రత్యేక టెస్టులు చేస్తున్నారు.

ఓమిక్రాన్ పై వ్యాక్సిన్‌లు పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, రెండు డోస్ లు తీసుకున్న వాళ్ళకి కూడా ఓమిక్రాన్ సోకిందని దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ తెలిపారు.

ఓమిక్రాన్ ప్రమాదకరమా? కాదా ? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తల నుండి సమాధానం ఇంకా రాలేదు. ప్రస్తుతానికి వైరస్ స్వభావం, దాని తీవ్రత గురించి అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఒక అంచనాకు రావడానికి మరింత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ వేరియంట్ అంటువ్యాధుల లాంటి లక్షణాలను కల్గిఉంది కాబట్టి దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని భావిస్తున్నారు.