Site icon HashtagU Telugu

Rahul Gandhi: భార‌త్‌లో ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ

`no Democracy In India Toda

`no Democracy In India Toda

 

Rahul Gandhi: త‌మ బ్యాంక్ అకౌంట్ల‌(Bank accounts)ను అన్నింటినీ ఫ్రీజ్(Freeze) చేశార‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఎన్నిక‌ల(Elections) కోసం త‌మ ప్ర‌చారాన్ని(campaign) నిర్వ‌హించ‌లేక‌పోతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈరోజు ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మ‌ద్ద‌తుదారులు, అభ్య‌ర్థ‌ల‌కు స‌పోర్టు ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్లు తెలిపారు. త‌మ నేత‌లు ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల వేళ త‌మ పార్టీ యాడ్స్‌ను ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి రెండు నెల‌ల ముందే త‌మ పార్టీని నిర్వీర్యం చేశార‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి షా.. క్రిమిన‌ల్ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు రాహుల్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నిక‌ల ముందు త‌మను నిర్వీర్యం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశార‌ని తెలిపారు. ప్రజాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఉన్న కొన్ని సంస్థ‌లు ఇప్పుడు ఆ ప‌నిచేయ‌లేక‌పోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఒక్క కోర్టు కూడా ఎటువంటి విష‌యాన్ని చెప్ప‌లేక‌పోతున్న‌ద‌న్నారు. ఎన్నిక‌ల సంఘం మౌనంగా ఉండిపోయింద‌న్నారు. మ‌రే సంస్థ కూడా నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. మీడియా కూడా ఏమీ చెప్ప‌డం లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. భార‌త్‌లో ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం లేద‌ని, రాజ్యాంగ‌, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌జ‌ల నుంచి దోచుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

read also: Holi Colours Side Effects: అల‌ర్ట్‌.. హోలీ రంగుల‌తో వ‌చ్చే స‌మ‌స్య‌లివే..!