Odisa Story: వరదనీటిలో మృతదేహానికి అంత్యక్రియలు..ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుంభకోత వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 07:30 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుంభకోత వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుంభకోత వర్షాల వల్ల పై ఇప్పటికే ఆస్తి నష్టం ప్రాణం నష్టం కూడా జరిగింది. కాగా ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో తరచూ వర్షాలు పడుతుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా చనిపోయిన వారికి అంత్యక్రియ నిర్వహించడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా వాగులు,వంకలు పొర్లి పొంగుతుండడంతో మూతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కస్టతరమవుతుంది.

కానీ ఒడిశాలో ఛాతిలోతు వరద నీటిలో ప్రతి దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బెహెరాగూడ గ్రామంలో చోటు చేసుకుంది. బెహెరాగూడ గ్రామానికి చెందిన శాంతారాణా అనే వ్యక్తి చాలా కాలంగా పక్షవాతంతో బాధపడుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు. అయితే గత కొద్దీ రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా గోలముండా బ్లాక్‌లోని బెహెరాగూడ గ్రామంలో వాగులు,వంకలు పొర్లి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శాంతా రాణా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వరదనీటిలో బెహెరాగూడ గ్రామ వాసులు చాలా కష్టపడ్డారు.

వాగుకు అవతలి వైపు శ్మశాన వాటిక ఉంది. అయితే వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు ఛాతీ లోతు నీటిలో శవాన్ని మోసుకొని వెళ్లారు. వర్షం కురుస్తుండటంతో మృతదేహం తడవకుండా గ్రామస్థులు అరటి ఆకులను కప్పారు.వరదనీటిలో అంత్యక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని మోసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దహన సంస్కారాల ఖర్చులను భరించలేని నిరుపేదల కోసం ఒడిశా ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం హరిశ్చంద్ర సహాయ యోజన పథకాన్నిప్రారంభించింది. ఈ పథకం కింద మృతుడు శాంతారాణా కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 అందించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు