Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు

వ్యాపారాలు, సినిమా, విద్య, వైద్యం.. రంగం ఏదైనా దాంట్లో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 01:03 PM IST

Social Media: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ముఖ్య ఆదేశం జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవని చెప్పింది. F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి అంటూ కీలక సూచనలు చేసింది. ’’ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు ఉంచొద్దు. ఒకవేల పోలీసులు గనక అతి ఉత్సాహం ప్రదర్శించి కేసు పెట్టి వేధిస్తున్నట్లయితే  ఈ ఆర్డర్ కాఫీతో కోర్ట్ మెట్లు ఎక్కి పోలీసు వారిపై చర్య తీసుకోమనవచ్చు’’ అంటూ ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం రాజకీయాలు, వ్యాపారాలు, సినిమా, విద్య, వైద్యం.. రంగం ఏదైనా దాంట్లో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. వేరే రంగాల విషయం ఎలా ఉన్నా.. రాజకీయం, గ్లామర్ రంగాల్లో సోషల్ మీడియా పోస్టులకు, కామెంట్స్‌కు హద్దు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో కేవలం పోస్టులపైనే పోలీసుల నజర్ ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ పోస్టుల కింద పెట్టే కామెంట్స్‌పైనా పోలీసులు (Telangana Police) ఫోకస్ పెట్టారు. హద్దు దాటి కామెంట్స్ పెడితే.. చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న కామెంట్ పెట్టినా.. ఎవరో పెట్టిన పోస్టు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా వ్యతిరేకించినా.. పోలీసు కేసుల్లో ఇరుక్కునే రోజులు వచ్చాయి. అయితే కేంద్రం నిర్ణయాలతో రాష్ట్రాలు ఏవిధంగా వ్యవహరిస్తాయో వేచి చూడాల్సిందే.