Site icon HashtagU Telugu

Nityananda Kailasa: అమెరికాలోని 30 సిటీలతో నిత్యానంద దేశం “కైలాస” అగ్రిమెంట్స్..?

Nityananda Country Kailasa Agreements With 30 Cities In America..

Nityananda Country Kailasa Agreements With 30 Cities In America..

పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రేపిస్ట్ బాబా నిత్యానంద (Nityananda) పై ఇప్పుడు అమెరికాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఆయన 2019 లో ట్విట్టర్ వేదికగా ప్రకటించుకున్న కల్పిత దేశం “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” గురించి వాడివేడి చర్చ జరుగుతోంది. తాజాగా ప్రముఖ అమెరికా మీడియా సంస్థ FOX NEWS ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

అమెరికాలోని దాదాపు 30 నగరాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో సిస్టర్ సిటీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని అందులో పేర్కొంది.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఉందా? లేదా ? దాని లొకేషన్ డీటెయిల్స్ ఏమిటి ? ఆ దేశాన్ని ప్రకటించిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అనేది తెలుసు కోకుండానే గుడ్డిగా దానితో అమెరికా సిటీస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని FOX NEWS పేర్కొంది. ఈ వివరాలను కనీసం గూగుల్ లో చెక్ చేసినా అవి అగ్రిమెంట్స్ కుదుర్చుకునేవి కావని తెలిపింది. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస వెబ్‌సైట్ ప్రకారం.. రిచ్‌మండ్, వర్జీనియాలోని డేటన్, ఓహియో, బ్యూనా పార్క్, ఫ్లోరిడా సహా 30 నగరాలు నిత్యావసర కైలాస దేశంతో సాంస్కృతిక భాగస్వామ్యంపై అగ్రిమెంట్స్ చేసుకున్నాయి” అని తెలిపింది.

దీనిపై ఆయా నగరాల ముఖ్య అధికారులు, పాలక స్థానంలోని నాయకుల అభిప్రాయాలను కూడా FOX NEWS సేకరించింది. “ఇప్పటివరకు చాలా అమెరికా నగరాలను మేం సంప్రదించాం.. కైలాస దేశంతో అగ్రిమెంట్స్ చేసుకున్న విషయం వాస్తవమేనని అవి ధృవీకరించాయి” అని FOX NEWS తాజా మీడియా రిపోర్ట్ పేర్కొంది.జాక్సన్‌విల్లే, నార్త్ కరోలినా సిటీల ఉన్నతాధికారులు ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. “కైలాసతో మా అగ్రిమెంట్స్ చెల్లవు. ఎందుకంటే మేము ఆ ప్రకటనలను ఇంకా ఆమోదించలేదు. వాటిని పరిశీలనలోనే పెట్టాం.” అని స్పష్టం చేశారు.

నెవార్క్ సిటీ అలర్ట్ కావడంతో..

అమెరికాలోని నెవార్క్ సిటీ జనవరి 12న కైలాస తో సిస్టర్ సిటీ అగ్రిమెంట్ పై సంతకం చేసింది. అయితే నిత్యానంద (Nityananda) ప్రకటించిన కైలాస దేశం ఫేక్ అని తెలియడంతో జనవరి 18నే ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంది.దీంతో అమెరికా నగరాలను నిత్యానంద కైలాస టీమ్ మోసగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

కైలాస అగ్రిమెంట్స్ కు హెల్ప్ చేసింది ఎవరు?

అమెరికాలోని కొన్ని సిటీల మేయర్లతో పాటు “ఫెడరల్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు” కూడా కల్పిత దేశం కైలాసతో అగ్రిమెంట్స్ కోసం హెల్ప్ చేస్తున్నారని FOX NEWS తెలిపింది. ప్రత్యేకించి ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కైలాసకు “ప్రత్యేక కాంగ్రెస్ గుర్తింపు” ఇచ్చారని పేర్కొంది.వారిలో ఒకరు హౌస్ అప్రాప్రియేషన్స్ కమిటీలో ఉన్న కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ మహిళ నార్మా టోరెస్ అని వెల్లడించింది. ఒహియోకు చెందిన రిపబ్లికన్ ట్రాయ్ బాల్డర్సన్ కూడా కైలాస దేశానికి కాంగ్రెస్ గుర్తింపు కోసం సహాయం చేశారని వివరించింది.

UN మీటింగ్ లో కైలాస ప్రతినిధులు.. ఎలా సాధ్యమైంది?

ఫిబ్రవరి 22న స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన UN మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ (CEDAW) సమావేశంలోనూ కైలాస దేశ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు ప్రసంగాలు చేశారు. రిప్రజెంటేషన్లు సమర్పించారు. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని CEDAW ఇప్పటికే ప్రకటించింది. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా పేరును నమోదు చేసుకొని ఆ మీటింగ్ లో కైలాస ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించింది.

Also Read:  Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చాలించి.. ఇక ఆఫీసుకు రండి.. ఉద్యోగులకు ప్రముఖ కంపెనీల ఆర్డర్