బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పాలక జనతాదళ్ (యూనైటెడ్) తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 57 మంది పేర్లను ఈ లిస్టులో విడుదల చేసింది. దీంతో నిన్న NDA కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ (BJP) 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, జేడీయూ కూడా తన బలాన్ని స్పష్టంగా చూపించింది. ఈసారి ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో, ప్రతి పార్టీ కూడా తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా జేడీయూ ఈసారి బలహీన ప్రాంతాల కన్నా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది.
Sai Dharam Tej : మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ పవన్ కల్యాణ్ విషెస్
NDA కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఇప్పటికే ఖరారైనప్పటికీ, దానిపై అంతర్గత అసమ్మతులు ఉత్పన్నమవుతున్నాయి. కూటమి కుదిరిన ఫార్ములా ప్రకారం BJP, JDU తలా 101 సీట్లలో పోటీ చేయగా, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు 29, రాష్ట్రీయ లోక్మత మరియు హిందుస్తానీ అవామీ మోర్చా (HAM)లకు చెరో 6 సీట్లు కేటాయించారు. అయితే ఈ సీట్ల కేటాయింపులో జేడీయూకు కేటాయించాల్సిన కొన్ని నియోజకవర్గాలను LJP (R)కు ఇవ్వడం జేడీయూ నేతలను అసహనానికి గురిచేసింది. అదే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఈ సీట్ల తగాదా NDA కూటమి లోపల అంతర్గత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, NDAలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు BJP మాత్రం కేంద్ర స్థాయిలో NDA ఏకతను కాపాడే ప్రయత్నంలో ఉంది. ఈ నేపధ్యంలో బిహార్ ఎన్నికలు కేవలం స్థానిక స్థాయి పోరాటం కాకుండా, జాతీయ రాజకీయాల సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద NDA కూటమి లోపల సీట్ల పంపకంపై ఉన్న చిచ్చు, రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.