Mission 24: మిషన్ 24… విపక్షాల ఐక్యతకు నితీష్ దూకుడు

ప్రధాని నరేంద్ర మోడీపై విపక్షాలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల్లో జోష్ కనిపిస్తుంది.

Mission 24: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)పై విపక్షాలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల్లో జోష్ కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. అంతకుముందు నితీష్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో ఈ భేటీ జరిగింది. విపక్షాల ఐక్యత ఎజెండాగా జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిసిన వెంటనే బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. (Delhi Politics)

బీహార్ సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చే అధికారాలను ఎలా తొలగిస్తారని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మేము అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా సమావేశాలు నిర్వహిస్తామని, దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని నితీశ్ కుమార్ చెప్పారు. ఢిల్లీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఢిల్లీ ప్రజల పక్షాన నిలుస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీయేతర ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బంది పెడుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. మేము వారితో నిలబడతాము. వివక్ష సరికాదు. ఇది జరగనివ్వమని అన్నారు.

బదిలీ పోస్టింగ్‌లు, విజిలెన్స్ మరియు ఇతర సంబంధిత విషయాల’కు సంబంధించి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (GNCTD) ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్డినెన్స్ పై రాజకీయ దుమారం చెలరేగింది. దీన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రం దుందుడుకు చర్యను తప్పుబడుతున్నాయి. ఈ మేరకు కేంద్రంపై పోరాటానికి విపక్షాలు ఏకమవుతున్నాయి.

ఇదిలా ఉండగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. మిషన్ 24 (Mission 24)లో భాగంగా బిజెపియేతర పార్టీలన్నీ ఏకమై మోడీని గద్దె దించేందుకు పధకాలు రచిస్తున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్ ఢిల్లీ సీఎంతో భేటీ అయ్యారు. ఇక నేడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

Read More: Delhi Vs Centre : కేంద్రం ఆర్డినెన్స్ పై దుమారం.. అందులో ఏముంది ?