Site icon HashtagU Telugu

Nitish Kumar : విపక్షాల ఐక్యత కోసం నితీష్,తేజస్వి యాదవ్ ప్రయత్నాలు.. ఢిల్లీ సీఎంతో భేటీ.. వర్కౌట్ అవ్వుద్దా??

Nitish Kumar, Tejashwi Yadav meet Delhi CM Kejriwal for unity among opposition parties

Nitish Kumar, Tejashwi Yadav meet Delhi CM Kejriwal for unity among opposition parties

దేశంలో మోడీ(Modi)ని గద్దె దించాలని ప్రతిపక్షాలు ఎంతగానో ట్రై చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే మోడీని అడ్డుకోలేరని గత కొన్నాళ్లుగా వారికి అర్థమవుతూనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టడం ప్రారంభించారు. పీఎం(PM) పదవిపై ఆశ ఉన్న నాయకులంతా ప్రతిపక్షాలని కలపాలని చూస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాలు కలవాలని, కొంతమంది కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత కోసం JDU నితీష్, RJD తేజస్వి యాదవ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా నితీష్, తేజస్వి యాదవ్ కలిసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కలిశారు. విపక్షాల ఐక్యత, ఢిల్లీలో పాలన, అధికారులపై కేంద్రం ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు తీర్పు పై వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఢిల్లీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై, ఢిల్లీ ప్రజలకు మద్దతుగా నితీష్ కుమార్ ఉంటారని, కేంద్రం ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చని, అలా జరిగితే 2024లో బీజేపీ ప్రభుత్వం పోతుందనే సందేశాన్ని పంపవచ్చని నితీష్ కుమార్ అన్నారు.

మేము అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను నితీష్, తేజస్వి యాదవ్ లు కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పీఎం పదవి కోరుకునే లిస్ట్ లో నితీష్ కూడా ఉన్నారు. ఎన్ని పార్టీలను కలుపుకుంటారు? BRS, తృణమూల్ లాంటి పార్టీలు వీరితో కలవడానికి ఒప్పుకుంటాయా? కాంగ్రెస్ ని వీరితో కలుపుకుంటారా? మరి వీరి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

 

Also Read : Music Director Koti : పరిస్థితుల వల్ల విడిపోయాం.. రాజ్ లేకపోయినా నా పక్కనే పాటల రూపంలో ఉంటాడు.. కోటి ఎమోషనల్..