Site icon HashtagU Telugu

Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Nitish Kumar Oath Ceremony

Nitish Kumar Oath Ceremony

Nitish Kumar Oath Ceremony: ఊహించినట్టే బీహార్ లో అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి జనతాళ్ బయటికి వచ్చింది. మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్(Nitish Kumar) ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం(Oath Ceremony) చేశారు. కొత్త కూటమి భాగస్వామిగా బీజేపీతో ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ 9వ సారి సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ మరియు విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

నితీష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు.

ఇప్పటివరకు ఎనిమిది సార్లు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే ఒక్కసారి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. నితీష్ కుమార్ 2000 సంవత్సరంలో బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రెండోసారి 2005లో మళ్ళీ బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి 2010లో బీజేపీతో, నాలుగోసారి 2015 లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐదోసారి 2015 లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి, ఆరోసారి 2017 బీజేపీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏడోసారి 2020 లో బీజేపీతోనే ప్రభుత్వం ఏర్పాటైంది. చివరిగా ఎనిమిదోసారి 2022 లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కలిసి గవర్నమెంట్ ఏర్పాటైంది. తొమ్మిదోసారి 2024, జనవరి 28న బీజేపీతో కలిసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.

Also Read: Oily Hair : జుట్టు జిడ్డుగా ఉందా.. అయితే నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?