Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

బీహార్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.

Bihar Politics: బీహార్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.

నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ కు అందించారు. బిజెపి మద్దతు లేఖను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అందజేయగా, గవర్నర్ లేఖను ఆమోదించారు. ఈ రోజు ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ వెళ్లారు. బీహార్‌లో సాయంత్రం 5 గంటలకు నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

నితీష్ బీజేపీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా తేజస్వి యాదవ్ మరియు లాలూ యాదవ్ పరిస్థితిపై రాజకీయ చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే తేజస్వీ యాదవ్ అధికారిక నివాసంలో నిన్న జరిగిన ఓ సమావేశంలో రాష్ట్రీయ జనతాదళ్ భవిష్యత్తు వ్యూహంపై మాట్లాడారు. నితీష్ కుమార్ ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని తేజస్వీ యాదవ్ అర్థం చేసుకున్నారు. భావోద్వేగమయ్యాడు. ప్రజలు మాకు న్యాయం చేస్తారంటూ ఎమోషనలయ్యాడు.

నితీష్ కుమార్ రాజీనామాపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, ప్రధాని మోదీ బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన ఘాటుగా స్పందించారు. వీరంతా తమ పార్టీల వాగ్దానాలు, సిద్ధాంతాలతో ప్రజలను మోసం చేశారన్నారు. ఇందులో నితీష్ కుమార్ ది అతి పెద్ద పాత్ర. ఒవైసీ పార్టీ బీజేపీ బీ టీమ్ అని నిన్న మొన్నటి వరకు వ్యాఖ్యలు చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీ తోనే జతకట్టారని మండిపడ్డారు.

Also Read: Ola S1: ఓలా ఎస్‌1 ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్స్.. ఏకంగా అన్ని రూ.వేలు తగ్గింపు?