Site icon HashtagU Telugu

Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. నవంబర్ 20న పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నాయకులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక రోజు ముందు బుధవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ సమావేశంలో ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో పాటు చిరాగ్ పాశ్వాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ పాల్గొన్నారు.

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ విజయం

బీహార్‌లో ఇటీవల పూర్తయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి 202 సీట్లను దక్కించుకుంది. బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా.. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) 85 సీట్లలో విజయం సాధించింది. వీటితో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19 సీట్లు గెలుచుకుంది. జీతన్ మాంఝీ పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఐదు సీట్లు, ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.

Also Read: Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!

ప్రమాణ స్వీకారంలో పాల్గొనే ప్రముఖులు ఎవరు?

నవంబర్ 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల వివిధ ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. ఇంతకుముందు పట్నాలోని ఆయన నివాసంలో జరిగిన జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ నేతగా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఇక రేపు నవంబర్ 20న ఆయన పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు బీహార్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సమ్రాట్ చౌదరి, ఉప నేతగా విజయ్ సిన్హా ఎన్నికయ్యారు.

Exit mobile version