Site icon HashtagU Telugu

Amit Shah In Bihar: 2024 ఎన్నిక‌ల ప్ర‌చారానికి బీహార్ లో `షా` శ్రీకారం

Amit Shah

Amit Shah

బీహార్ లో ప్ర‌చారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. 2024 సాధార‌ణ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే రంగంలోకి దిగారు. బీహార్ లో బీజేపీ సోలోగా ప్ర‌చారంలోకి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీహార్‌లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజ‌కీయ‌దాడిని షా ప్రారంభించారు. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి ఆశ‌యాన్ని నెర‌వేర్చ‌కోవ‌డానికి నితీష్ బీజేపీకి ద్రోహం చేశార‌ని ఆరోపించారు. నితీష్ కాంగ్రెస్‌తో మహాఘటబంధన్ (మహాకూటమి)లో చేరిన తర్వాత రాష్ట్రంలో బిజెపి నిర్వహించిన మొదటి ర్యాలీ ఇది.

షా ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ బీజేపీ కంటే సగం సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయిన‌ప్ప‌టికీ మోడీ ఇచ్చిన మాట ప్ర‌కారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి అవ‌కాశం. ఇచ్చార‌ని షా గుర్తు చేశారు. బీజేపీకి ద్రోహం చేసిన నితీష్ కాంగ్రెస్ మరియు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపార‌ని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో విమానాశ్రయంతో సహా పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను జాబితా షా గుర్తు చేశారు. స‌భ ముగిసిన త‌రువాత‌ కిషన్‌గంజ్‌లో బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేంద్ర హోంమంత్రి సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వ‌హించ‌డం ద్వారా దిశానిర్దేశం చేశారు.