NITI Aayog Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. ఒకవైపు ఆర్థిక లేమి, మరోవైపు పశ్చిమ బెంగాల్‌ను విభజించే కుట్ర జరుగుతోంది. ఈ రెండు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు నేను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతానని స్పష్టం చేశారు బెంగాల్ సీఎం. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఆమెతో పాటు దేశ రాజధానికి వెళ్తున్నారు మమతా. కేవలం పశ్చిమ బెంగాల్‌పైనే కాకుండా ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కూడా ఆర్థిక లేమి సమస్యలపై నిరసన గళం వినిపించేందుకు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. ”కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. అలాంటి అభిమానాన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్‌లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను” అని అన్నారు.(Niti Aayog Meeting)
రాష్ట్రాన్ని విభజించేందుకు అన్ని రకాల ఆర్థిక, భౌగోళిక కుట్రలు జరుగుతున్నాయి. బెంగాల్‌ను విభజించాలని సందేశాలు పంపుతున్నారు. బెంగాల్ విభజన అంటే దేశ విభజన. దీనిని మేము అంగీకరించలేము. అటువంటి పరిస్థితిలో నేను సమావేశంలో ఉంటాను. నా వాయిస్‌ని రికార్డ్ చేయడానికి నన్ను అనుమతిస్తే నేను చేస్తాను. లేకుంటే నిరసనగా వాకౌట్ చేస్తాను అని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ దేశ రాజధాని పర్యటన సందర్భంగా పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడా సమావేశం కానున్నారు. అదేరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో కూడా సంభాషించనున్నారు.