Site icon HashtagU Telugu

Death Penalty Overturned : ‘నిఠారీ’ సీరియల్ కిల్లింగ్స్.. ఇద్దరి మరణశిక్షలు రద్దు.. ఏమిటీ కేసు ?

Death Penalty Overturned

Death Penalty Overturned

Death Penalty Overturned : ఉత్తరప్రదేశ్ లోని నోయిడా పరిధిలో నిఠారీ గ్రామం ఉంది. ఆ ఊరిలో 2005 నుంచి 2006 మధ్య అనుమానాస్పద రీతిలో సీరియల్ కిల్లింగ్స్ జరిగాయి. దీంతో అక్కడ కలకలం రేగింది.  2006 డిసెంబరులో స్థానిక  వ్యాపారవేత్త మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ ఇంటి సమీపంలోని ఓ మురికి కాల్వలో కొన్ని మానవ శరీర భాగాలు లభించాయి. పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా..మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ ఇంటి వెనుక ఉన్న పెరట్లోనూ అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో దాదాపు ఏడాదికాలంగా కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవే అని అప్పట్లో  పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో పంధేర్‌ ఇంట్లో సురేందర్‌ కోలీ అనే వ్యక్తి పనిచేసేవాడు. సురేందర్‌ కోలీ.. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి పిలిచి హత్య చేసి, మృతదేహాలపై లైంగిక దాడి చేసేవాడని అప్పట్లో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.  చంపిన వారిని ఇంటి వెనుక భాగంలోసురేందర్ కోలీ పాతిపెట్టేవాడని సీబీఐ ఆరోపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇవాళ ఏం జరిగింది ?

ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్‌ కోలీ, మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ను ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా వారిపై నమోదైన మొత్తం 19 కేసులకుగానూ మూడు కేసుల్లో నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఈ  మూడు కేసుల్లో వారికి పడిన మరణశిక్ష రద్దయింది.12 కేసుల్లో తనకు పడిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ కోలీ, రెండు కేసుల్లో తనకు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ పంధేర్‌ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ఇవాళ కోర్టు తీర్పును(Death Penalty Overturned) వెలువరించింది

Also Read: Cricket In Olympics :  2028 ఒలింపిక్ గేమ్స్ లో టీ20 క్రికెట్ .. ఐఓసీ గ్రీన్ సిగ్నల్