వాలంటైన్స్ డే (Valentine’s Day) వేడుకలపై హిందు సంఘాలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు (University) కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రేమ పేరుతో యువతీ యువకులు క్యాంపస్ పరిసరాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. క్లాసు రూముల్లో, క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ (Public Romance)గానే రొమాన్స్ చేస్తూ తోటి విద్యార్థులకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో కొన్ని యూనివర్సిటీలు ప్రేమికుల రోజున (Valentine’s Day) ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులాటలు, చనువుగా ఉండటాన్ని నిషేధించాయి.
ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాలికట్ (NITC) తన క్యాంపస్‌లో బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. విద్యార్థిని, విద్యార్థులు (Lovers) క్రమశిక్షణా విధానాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యకు దారి తీస్తుందని హెచ్చరించింది. ‘‘PDAలు (పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ ఆప్ఫెక్షన్), అకడమిక్ ప్రాంతాలు, విశ్రాంతి గదులు వెలుతురు సరిగా లేని ప్రదేశాలలో ప్రైవేట్ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ఇతరులకు అసౌకర్యంగా అనిపించవచ్చు. విద్యా వాతావరణం నుండి దృష్టి మరల్చవచ్చు’’ అని తేల్చి చెప్పింది. అమ్మాయిలు, అబ్బాయిలు యూనివర్సిటీలో క్యాంపస్ లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (Valentine’s Day)కు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.