Nita Ambani: అనంత్‌ అంబానీ , రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక సందేశం

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 12:51 PM IST

 

Nita Ambani: భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani ) తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani ) ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ (Gujarat) లోని జామ్ నగర్ (Jamnagar) సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant)ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు జామ్ నగర్ కు తరలి వస్తున్నారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుల్లో కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్ నగర్ చేరుకున్నారు. బిల్ గేట్స్ కూడా రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.

ఇక వేడుకల ప్రారంభం సందర్భంగా ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశానిచ్చారు. ఈ పెళ్లి విషయంలో తనకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నట్లు చెప్పారు. అందులో ఒకటి తమ మూలాలను గుర్తించుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంకోటి.. ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తాము కోరుకున్నట్లు వివరించారు. జామ్ నగర్ తమ హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతమని… తన కెరీర్ ను తాను ఇక్కడే ప్రారంభించానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్‌జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు.

ఆహ్వానం అందిన వారు ఇప్పటికే జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌, తన సతీమణి ప్రిసిల్లా చాన్‌, పాప్‌ సింగర్‌ రిహన్నా, బాలీవుడ్‌ తారలు రణ్‌వీర్‌ – దీపిక, ఆలియా భట్‌-రణబీర్‌ కపూర్‌, రాణీ ముఖర్జీ, షారుక్‌ ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్, దర్శకుడు అట్లీ తదితరులు ఇప్పటికే జామ్‌నగర్‌ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

read also : Railway Unions : మే 1 నుంచి రైళ్లన్నీ ఆపేస్తాం.. కేంద్రానికి యూనియన్ల వార్నింగ్