హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం (Balkampet Yellamma Temple) కు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) గొప్ప దాతృత్వాన్ని చూపించారు. ఆలయ అభివృద్ధి మరియు నిత్యాన్నదాన కార్యక్రమాల కోసం ఆమె రూ. కోటి విరాళాన్ని (1 Cr Donation) ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో మహేందర్ గౌడ్ బుధవారం వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి దానిపై వచ్చే వడ్డీతో అన్నదాన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలనే ఉద్దేశంతో ఇది చేపట్టారు.
Shamshabad Airport : రూ.14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణ!
గత ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ కలిసి బల్కంపేట ఎల్లమ్మ మరియు పోచమ్మ దేవస్థానాలను దర్శించుకున్నారు. ఆ సమయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత, అభివృద్ధి అవసరాలు, భక్తులకు మరింత సౌకర్యాల కల్పన వంటి అంశాలపై అప్పటి ఈవో కృష్ణ వీరికి వివరించారు. అంతేకాక అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించాలని ప్రార్థించారు. ఈ విజ్ఞప్తిని హృదయపూర్వకంగా స్వీకరించిన నీతా అంబానీ, విరాళం అందజేయడం భక్తుల కోసం ఓ మంచి ఉదాహరణగా నిలిచింది.
Immunity : వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీ మరింత పెరగాలంటే ఈ పండు ఒక్కటి చాలు !
ఈ విరాళంతో భక్తులకు ప్రతిరోజూ అన్నదానం అందించడానికి, అలాగే భక్తులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచడానికి దేవస్థానం యాజమాన్యం సన్నద్ధమవుతోంది. భక్తులకు ఇలాంటి సేవలు అందించడం ద్వారా ఆలయ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో నీతా అంబానీ మరియు ఆమె కుటుంబానికి ఆలయ యాజమాన్యం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది భక్తి, సేవా భావన కలగలిసిన ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.