Site icon HashtagU Telugu

Nirmala Sitharaman: లాలూకి ఇచ్చి పడేసిన మంత్రి నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించిందని ఆర్థిక మంత్రి అన్నారు. రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కు బీజేపీ తగిన సమాధానం చెప్పిందని ఆమె అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమని, దేశం మొత్తం ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని ప్రధాని మోదీ సరిగ్గానే చెప్పారు. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఇన్ని దశాబ్దాలు గడిపిన వ్యక్తి నుంచి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు సరికాదు అని ఆమె అన్నారు.

ప్రధాని చేసిన ఆరోపణలపై లాలూ ప్రసాద్ స్పందిస్తూ.. ప్రధాని మోదీకి కుటుంబం లేకపోతే మనం ఏమి చేయగలం. రామ మందిరం గురించి ప్రధాని మోదీ ప్రగల్భాలు చెప్తూనే ఉన్నారు. కానీ ఆయన హిందువు కూడా కాదు. తల్లిదండ్రులు మరణించిన తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం కొడుకు తల మరియు గడ్డం రెండింటినీ షేవ్ చేయవలసి ఉంటుంది. తన తల్లి మరణించిన తర్వాత ప్రధాని మోదీ అలా చేయలేదు అని లాలూ హాట్ కామెంట్స్ చేశారు.

లాలూ ప్రసాద్‌ని ఉద్దేశించి ప్రధాని మోడీ స్పందిస్తూ నా జీవితం తెరిచిన పుస్తకం. ఈ దేశంలోని 140 కోట్ల మంది నా కుటుంబం. మోదీ కుటుంబంలో నేడు కోట్లాది మంది ఆడపిల్లలు, తల్లులు, సోదరీమణులు ఉన్నారు. దేశంలోని ప్రతి పేద వ్యక్తి నా కుటుంబం అని చెప్పారు.

Also Read: Akhanda 2: సెంటిమెంట్ గా ఆ రోజునే బాలయ్య అఖండ 2 అనౌన్స్