Site icon HashtagU Telugu

Nirmala Sitharaman: మొరాకో ప‌ర్య‌ట‌న‌లో నిర్మ‌లా సీతారామ‌న్‌, ఆర్థిక విషయాలపై చర్చ

Developed Country

Nirmala Sitharaman

Nirmala Sitharaman: మొరాకో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. అమెరికా ఆర్థిక మంత్రి స‌హా ప‌లు దేశాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు. ఐఎంఎఫ్ స‌హా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హిస్తున్న వార్షిక స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌సంగించారు. అనంత‌రం ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రూనోలా మాయ‌క్‌తో భేటీ అయి ఇరు దేశాల ఆర్థిక ప‌ర‌మైన‌ అంశాల‌పై చ‌ర్చించారు.

అదేవిధంగా భార‌త్‌లో నిర్వ‌హించిన జీ-20 స‌ద‌స్సుల‌పైనా చ‌ర్చించారు. ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితిపైనా ఇరువురు నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక శాఖ‌ మంత్రితోనూ నిర్మ‌లా సీతారామ‌న్ భేటీ అయి ఇరు దేశాల ఆర్థిక సంబంధాల‌పైనా చ‌ర్చించారు.  అలాగే ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు జే. బంగాతోనూ కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. భార‌త దేశ ఆర్థిక విష‌యాల‌ను చ‌ర్చించారు.

Also Read: BRS Minister: మంత్రి ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం, కేటీఆర్, కవిత సంతాపం