ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం అంటే ఇదే ..
సింప్లిసిటీకి.. డెఫినేషన్ ఇదే..
దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఎంతో సింపుల్ గా తన కూతురు పరకాల వాంగ్మయికి(Parakala Vangmayi-Pratik Doshi) నిర్మలా సీతారామన్ పెళ్లి చేశారు.
వీఐపీలు, రాజకీయ నాయకుల హడావుడి లేకుండా బెంగుళూరులోని తన ఇంటి దగ్గరే ఈ వివాహ ఘట్టం జరిగింది. వివరాలివీ..
మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచే..
ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ గురించి చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. సీతారామన్ అల్లుడు ప్రతీక్ గుజరాత్ వాస్తవ్యుడు. ఆయన ప్రస్తుతం పీఎంవోలో ప్రధాని మోడీకి ప్రత్యేక సహాయకుడి (స్పెషల్ డ్యూటీ అధికారి)గా పనిచేస్తున్నారు. పీఎంవో అంటే.. ప్రధానమంత్రి కార్యాలయం. 2014 సంవత్సరం నుంచి ప్రతీక్ పీఎంవోలో పనిచేస్తున్నారు. అయితే 2019లో జాయింట్ సెక్రటరీ ర్యాంక్ ఇచ్చి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా చేశారు. పీఎంవోలో ప్రతీక్.. ప్రధాని మోడీకి అవసరమైన పరిశోధన, వ్యూహ రచన వంటి కార్యకలాపాలతో ముడిపడిన విధులు నిర్వర్తిస్తుంటారు. సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక్ .. తొలుత నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరారు.
నిర్మలా సీతారామన్ కూతురు జర్నలిస్ట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి (Parakala Vangmayi-Pratik Doshi)1991 మే 20న చెన్నైలో జన్మించారు. నిర్మల భర్త పరకాల ప్రభాకర్ రాజకీయ ఆర్థికవేత్త. ఆయన 2014 జూలై నుంచి 2018 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్స్ సలహాదారుగా వ్యవహరించారు. పరకాల వాంగ్మయి ఒక జర్నలిస్ట్. ఆమె ప్రస్తుతం లైవ్ మింట్ (livemint) న్యూస్ వెబ్ సైట్ లోని “మింట్ లాంజ్” (mint lounge) లో ఫీచర్ రైటర్ గా పనిచేస్తున్నారు. వాంగ్మయి ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కూడా కోర్సును పార్టీ చేశారు. ఆర్థిక మంత్రి కుమార్తె అయినప్పటికీ ఆమె ఎన్నడూ ప్రజల దృష్టిలో పడలేదు. 2019లో డాటర్స్ డే సందర్భంగా నిర్మలా సీతారామన్ తన కుమార్తె చిన్ననాటి ఫోటోను ఒకదాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో కూతురిని స్నేహితురాలిగా, తత్వవేత్తగా, గైడ్ గా ఆమె అభివర్ణించారు.