Budget 2023: ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్!

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి.

Published By: HashtagU Telugu Desk
Budjet

Budjet

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ (Central Bedget) ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌నే (Central Bedget) ప్రవేశపెడుతున్నారు.

చివరి బడ్జెట్ ఇదే

అదే సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించారు. బడ్జెట్‌ ట్యాబ్‌ను ఎరుపు రంగు పౌచ్‌లో ఉంచి తీసుకొచ్చారు. ప్రజలు, ఎంపీలకు బడ్జెట్‌ వివరాలు అందుబాటులో ఉంచేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ (Mobile App) ను తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రస్తుత ప్రభుత్వానికి (Central Govt) పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ ఇదే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపిన అనంతరం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ ట్యాబ్‌తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు (President Bhavan) చేరుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్‌ గురించి రాష్ట్రపతికి వివరించారు. బడ్జెట్ ట్యాబ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్ (Central Bedget) కు ఆమోదం తెలిపారు. 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అన్ని వర్గాలకు ఆశాదీపం

‘‘యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం ఈ బడ్జెట్‌. ఆర్థిక వృద్ధిరేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ (Covid19) కారణంగా ప్రగతి మందగిస్తే, భారత్‌ మాత్రం దూసుకుపోయింది. పూర్వ బడ్జెట్‌లు నిర్మించిన పునాదులపై ఈ బడ్జెట్‌ సమర్పిస్తున్నాం. భారత దేశం తలెత్తుకుని నిలబడుతోంది. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌ (First Budget). డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. సమష్టి ప్రగతి దిశగా భారత్‌ కదులుతోంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టాం. 220 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌లను అందించాం. 44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోంది. విశ్వకర్మ కౌశల్‌ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నాం. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోంది’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

  Last Updated: 01 Feb 2023, 11:57 AM IST