Interim Budget : సాదాసీదా బడ్జెట్ నే నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతోందా..?

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 07:29 AM IST

మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్‌(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం సాదాసీదా బడ్జెట్ నే ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈసారి బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని ఆమె ముందు నుండి చెబుతూవస్తోంది. దానికి తోడు మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందనే ప్రచారం గట్టిగా జరుగుతుండడంతో కేంద్రంలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. దాంతో.. ఈసారి బడ్జెట్ సాదాసీదాగానే ఉంటుందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

సాధారణంగా బడ్జెట్ సమయంలో.. కొత్త పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. కానీ ఇండియాలో ఇప్పటికే పథకాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఉచిత పథకాలను క్రమంగా తగ్గించెయ్యాలని కేంద్రం చూస్తుంది. అందుకే ఈసారి బడ్జెట్ లో కొత్త పధకాలు అనేవి ప్రవేశ పెట్టకుండా..ఉన్న పథకాల్లోనే మార్పులు , చేర్పులు చేయాలనీ చూస్తుంది. కొంతవరకైనా పేదవారు, బడుగు బలహీన వర్గాల వారికి అనుకూల నిర్ణయాలు ఉంటాయనీ, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి అనుకూలమైన బడ్జెట్ ఉంటుందని సమాచారం.

ముఖ్యంగా ఈరోజు ప్రవేశ పెట్టె మధ్యంతర బడ్జెట్ లో ప్రజల చేతిలో డబ్బు ఉండేలా.. పన్ను మినహాయింపులు పెంచే ఛాన్స్.. రైతులకు మేలు జరిగేలా, పీఎం కిసాన్ చెల్లింపులను పెంచుతారనే అంచనా అందరిలో నెలకొంది. రైల్వేలు, రోడ్లు, సెమీ-పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. విద్య, వైద్య రంగాలకు మరిన్ని నిధులు , చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కొన్ని ప్రోత్సాహకాలు ,డిజిటల్‌గా దేశాన్ని ముందుకు నడిపే నిర్ణయాలు ,కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని పెంచేలా మరిన్ని నిర్ణయాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. మరి ప్రజలు అనుకునేలా బడ్జెట్ ఉంటుందో.. లేదో కాసేపట్లో తెలుస్తుంది.

Read Also : First Budget in India : ఇండియాలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా..?