Site icon HashtagU Telugu

Chhattisgarh : బస్తర్ ఫైటర్స్ యూనిట్లో తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లకు చోటు..!!

Trans

Trans

లింగ వివక్ష…దేశంలో సామాజిక సమస్యగా మారిన ఈ అంశాన్ని రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బస్తర్ ఫైటర్స్ ప్రత్యేక యూనిట్లో తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. బస్తర్ ఫైటర్స్ యూనిట్ ను మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోహరిస్తారు.

బస్తర్ ఫైటర్స్ యూనిట్ నియామాకాల కోసం ఈ మధ్యే రిక్రూట్ మెంట్ నిర్వహించారు. మొత్తం 608 మంది ఇందులో సెలక్ట్ అయ్యారు. వారిలో ఎనిమింది మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వారు కాంకేర్ జిల్లాకు చెందినవారు. మరో ట్రాన్స్ జెండర్ ది బస్తర్ జిల్లా. వీరు కానిస్టేబుల్ హోదాలో పోలీసు ఉద్యోగాలను పొందారు. వీరికి రాయ్ పూర్ లోని పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

కాగా ఛత్తీస్ గఢ్ లో గిరిజన ప్రజలు ఎక్కువగా జీవనం కొనసాగిస్తుంటారు. మావోలపై పోరులో స్థానికుల సహకారం ఎంతో అవసరం ఉంటుంది. స్థానిక ప్రజలకు, పోలీసు బలగాలకు మధ్య సమన్వయకర్తలుగా బస్తర్ ఫైటరస్ వ్యవహరిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే 2020లో ఛత్తీస్ గఢ్ సర్కార్ ప్రత్యేక యూనిట్ కు రూపకల్పన చేసింది.

Exit mobile version