NIA Vs Khalistan Separatist : ఎన్ఐఏ కొరడా.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ ఆస్తులన్నీ సీజ్

NIA Vs Khalistan Separatist : కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్థాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నిర్వాహకుడు  గురపత్వంత్ సింగ్ పన్నూపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝుళిపించింది.

  • Written By:
  • Updated On - September 23, 2023 / 03:47 PM IST

NIA Vs Khalistan Separatist : కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్థాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నిర్వాహకుడు  గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝుళిపించింది. కెనడాలోని హిందువులంతా ఇండియాకు వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఆ కరుడుగట్టిన వేర్పాటువాదికి చెందిన అమృత్‌సర్, ఛండీగఢ్‌లోని అన్ని ఆస్తుల్ని సీజ్ చేసింది. ఛండీగఢ్‌లోని సెక్టార్‌ 15లో ఉన్న గురుపత్వంత్ సింగ్‌ ఇంటిని సీజ్ చేసింది.

Also read : Gold Laddu : గణపయ్య చేతిలో ‘బంగారు లడ్డు’..చూసేందుకు వస్తున్న భక్తులు

దాదాపు అరగంట పాటు  గురుపత్వంత్ ఇంట్లో సోదాలు నిర్వహించిన NIA.. చివరకు అతడి ఇంటిని జప్తు చేసినట్లు ప్రకటించింది. ఆ తరవాత ఇంటి ముందు ఓ నోటీస్ బోర్డ్ ను అతికించింది. అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్‌ గ్రామంలో గురుపత్వంత్‌ సింగ్‌ కు చెందిన వ్యవసాయ భూమినీ ఎన్ఐఏ జప్తు చేసింది. గురుపత్వంత్‌పై రివార్డు కూడా ప్రకటించింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్…అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేష  ప్రచారం చేస్తున్నాడు. అతడిపై  భారత్ లో దేశ ద్రోహం కేసుతో పాటు మొత్తం 7 కేసులు నమోదయ్యాయి.