Site icon HashtagU Telugu

NIA Most Wanted List : NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు

Telugu States Youth In Nia

Telugu States Youth In Nia

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుల పేర్లు ఉండడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఈ లిస్ట్ లో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ పేర్లు లిస్ట్ లో తెలిపింది. వెంటనే వీరి ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేసింది. వీరి ఫొటోలతో కూడిన వివరాలను ‘ఎన్ఐఏ ఇండియా’ ట్విటర్ ఖాతాలో అధికారులు పోస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసులో దేవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు కేరళ 11 మంది, కర్నాటక ఐదుగురు, తమిళనాడు చెందిన ఐదు మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్ గా ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. వీరి సమాచారం తెలిస్తే 9497715294 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతో పాటు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.

Read Also : Free Bus For Ladies : ఐడీ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ..లేదంటే ఛార్జ్ చెల్లించాల్సిందే – TSRTC