Site icon HashtagU Telugu

Dawood Ibrahim : ప‌ట్టుకుంటే పాతిక ల‌క్ష‌లు

Dawood

Dawood

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకి తెలిపితే రూ. 25 ల‌క్ష‌ల రివార్డును ఎన్ ఐఏ ప్ర‌క‌టించింది. గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ , నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (ఎఫ్‌ఐసిఎన్) స్మగ్లింగ్ , పాకిస్థానీ ఏజెన్సీలు , ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉన్న‌ట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉగ్రదాడులకు పాల్పడే ‘డి’ కంపెనీ – దావూద్‌ గ్యాంగ్‌కు సంబంధించి ఈ విచారణ జరిగింది. .

దావూద్‌ సోదరుడు అనీస్ ఇబ్రహీం అలియాస్ హాజీ అనీస్‌కు కూడా ఎన్ ఐఏ రివార్డులను ప్రకటించింది; సన్నిహితులు జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మెమన్ అలియాస్ టైగర్ మెమన్ ల‌కు రివార్డ‌ల‌ను వెల్ల‌డించింది. దావూద్ రివార్డు మొత్తం రూ.25 లక్షలు కాగా, ఛోటా షకీల్‌కు రూ.20 లక్షలు, అనీస్, చిక్నా, మెమన్‌లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ప్రకటించింది.

ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీలాండరింగ్, FICN సర్క్యులేషన్, టెర్రర్ నిధులను సేకరించడం, లష్కర్‌తో సహా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో క్రియాశీల సహకారంతో కీలక ఆస్తులను అనధికారికంగా స్వాధీనం చేసుకోవడం, సంపాదించడం వంటి వివిధ ఉగ్రవాద-నేర కార్యకలాపాలలో పాల్గొంటున్నార‌ని తేల్చింది.