Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

హోటల్ , రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీలు వేస్తే సంబంధిత హోటల్ లేదా రెస్టారెంట్ అథారిటీ పైన 1915కి కాల్ చేసి ఫిర్యాదు చేయ‌డానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్ర‌క‌టించింది.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 06:30 PM IST

హోటల్ , రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీలు వేస్తే సంబంధిత హోటల్ లేదా రెస్టారెంట్ అథారిటీ పైన 1915కి కాల్ చేసి ఫిర్యాదు చేయ‌డానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్ర‌క‌టించింది. అంతేకాదు, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)కి కూడా ఫిర్యాదు చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. NCH ​​మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయ‌డానికి కూడా వెసుల‌బాటు ఉంది. ఎడాఖిల్ పోర్టల్, http://www.edaakhil.nic.inలో
వినియోగదారుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని సీసీపీఏ వెల్ల‌డించింది.

హోటళ్లు , రెస్టారెంట్‌లు ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జీలను విధించడం, ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా చూపించ‌డాన్ని వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌శాఖ‌ నిషేధించింది. ఇక నుంచి ఎవ‌రూ స‌ర్వీస్ చార్జీల‌ను చెల్లించ‌న‌వ‌స‌రంలేద‌ని CCPA మార్గదర్శకాలను ప్ర‌క‌టించింది. ఒక వేళ‌ ఉల్లంఘించినప్పుడు ఫిర్యాదులను దాఖలు చేయాల‌ని సూచించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలను నిరోధించడానికి మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది.

సర్వీస్ ఛార్జ్ మార్గదర్శకాలు
CCPA జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, “ఏ హోటల్‌లు లేదా రెస్టారెంట్‌లు ఆటోమేటిక్‌గా లేదా బిల్లులో డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీని జోడించవు.”మరే ఇతర పేరుతో సేవా రుసుము వసూలు చేయకూడదు, జోడించకూడ‌దు.
సేవ ఛార్జీని చెల్లించమని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారుని బలవంతం చేయదు. సేవా రుసుము స్వచ్ఛందంగా, ఐచ్ఛికంగా వినియోగదారుల అభీష్టానుసారం అని తెలియ‌చేస్తూ వినియోగదారుకు స్పష్టంగా తెలియచేస్తూ అవ‌గాహ‌న క‌ల్పించాలి.”సేవా ఛార్జీల సేకరణ ఆధారంగా వినియోగదారులపై ప్రవేశం లేదా సేవలను అందించడంపై ఎటువంటి పరిమితి విధించబడదు” అని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. మార్గదర్శకాలను ఉల్లంఘించి హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నట్లు ఎవరైనా కస్టమర్ కనుగొంటే, బిల్లు మొత్తం నుండి వాటిని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్ అధికారాన్ని అభ్యర్థించవచ్చు. ఒక వేళ తొలిగించ‌క‌పోతే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1915కి ఫోన్ చేయాల‌ని సీసీపీఏ కోరింది.