Site icon HashtagU Telugu

Ukraine: రష్యా సైనికుల పరిస్థితిపై ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం!

Ukraine , Russia War India Student

Ukraine , Russia War India Student

ప్రస్తుతం ప్రపంచమంతా చర్చించుకుంటున్న అంశం ఏదైనా ఉంది అంటే… అది రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేమే. బలిసినోడు… బక్కోడిని కొట్టడమంటే ఇదే అని అందరూ రష్యాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… రష్యా తీరును యావత్ ప్రపంచం ఖండిస్తోంది. బలవంతుడు బలహీనుడిని కొడితే… భగవంతుడు బలవంతుడిని కొడతారని… ఇది తప్పకుండా రష్యా అధ్యక్షుడి విషయంలో జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారు.

తాజాగా రష్యా దుందుడుకు చర్య, వారి సైన్యం పరిస్థితిపై ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదేంటంటే… ఉక్రెయిన్ లోకి దూసుకొచ్చి యుద్ధం చేస్తున్న రష్యా సైనికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఆ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్ లోని రష్యా సైనికుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని.. తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నారని తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. రష్యా సైన్యంలో ఎక్కువమంది యువకులే ఉన్నారని… పూర్తిస్థాయి యుద్ధంలో ఎలా పాల్గొనాలో వారికి సరైన శిక్షణ ఇవ్వలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ ఆ కథనంలో రాసుకొచ్చింది. వారి దయనీయ పరిస్థితికి అదే ప్రధాన కారణంగా వెల్లడించింది. ఉక్రెయిన్‌లో కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చిపారేయాలని సైన్యాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ… వారికి ఆ పనిచేయడానికి మనస్కరించడం లేదని చెప్పుకొచ్చింది.

శత్రుదేశ పౌరులను కాల్చడం, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఇష్టపడని రష్యన్ సైనికులు…. తమ సొంత వాహనాలనే ధ్వంసం చేసుకుంటున్నారంటూ ఆ కథనంలో ‘న్యూయర్క్ టైమ్స్’ వివరించింది. చివరిగా ఈ విషయాలన్నీ కూడా పుతిన్ ఆదేశాలమేరకు ఉక్రెయిన్ యుద్దంలో దిగిన రష్యా సైనికులే వెల్లడించినట్లు తెలిపింది. ఇలా ఇష్టం లేకున్నా కూడా… రష్యన్ సైనికులు ఉక్రెయిన్ తో యుద్దం చేస్తున్నారని… వారి మనసు అంగీకరించకున్నా… తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తోందన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో రష్యన్ సైనికుల మానసిక సంఘర్షణను రాసుకొచ్చింది.

Exit mobile version