Site icon HashtagU Telugu

Air Asia Offers: న్యూ ఇయర్ ఆఫర్: రూ.1,497కే ఫ్లయిట్ జర్నీ చేసేయండి!

Airasia Airbus A320 Aircraft

Airasia Airbus A320 Aircraft

దేశంలో విమానయాన రంగంలో ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఎయిరిండియాను తప్పితే మిగతావన్నీ ప్రైవేటు సంస్థలే. ఎయిరిండియాను (Air India) కూడా టాటా సంస్థ కొనుగోలు చేసింది. దీంతో అంతా ప్రైవేటుమయంగా మారిపోయింది. కంపెనీలు ఎక్కువవడంతో కాంపిటీషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. కారు చౌక ధరలకు వినియోగదారులకు ఎయిర్ జర్నీ సర్వీసులను అందిస్తున్నాయి.

దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఏషియా కొత్త ఏడాది సందర్భంగా తన కస్టమర్లకు సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని ‘న్యూ ఇయర్, న్యూ డీల్స్’ పేరిట తమ ప్రారంభ టిక్కెట్ ధరను రూ.1,497గా నిర్ణయించింది.

ఎయిర్ ఏషియా సంస్థ ఈ ఆఫర్ డిసెంబర్ 25 (క్రిస్మస్) వరకే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. దీని కింద బుకింగ్ చేసుకున్న ప్యాసింజర్లు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14లోపు ప్రయాణించొచ్చని తెలిపింది. తీసుకున్న టిక్కెట్ తోపాటు మరెన్నో ప్రయోజనాలను కూడా అందిస్తామని చెప్పింది.

ఒక్క టిక్కెట్ తో ప్రయోజనాలెన్నో!
ఈ స్పెషల్ ఆఫర్ బెంగళూరు–కొచ్చి వంటి రూట్లతోపాటు తమ నెట్ వర్క్ అంతటా వర్తిస్తుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది. సంస్థ వెబ్ సైట్, మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ చానెల్స్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. తాము కొనసాగిస్తున్న లాయల్టీ బెనిఫిట్స్ లో భాగంగా వెబ్ సైట్, యాప్స్ లో బుకింగ్ చేసే (నియో పాస్) సభ్యులు కాంప్లిమెంటరీగా ఫ్రూట్ ప్లాటర్, ఇంపార్టెంట్ చెక్ ఇన్, బ్యాగేజీ, బోర్డింగ్ సదుపాయాలతోపాటు 8 శాతం నియో కాయిన్స్ కూడా పొందుతారని పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం, జీవితంలో ఒక్కసారైనా ఫ్లయిట్ జర్నీ చేయాలని కలులుగనే సామాన్యులారా దీన్ని వినియోంచుకోండి. మీకు నచ్చిన చోటుకు హాయిగా ఎగిరిపోండి.