New Parliament – New Uniform : పార్లమెంటు భద్రతా సిబ్బందికి న్యూ యూనిఫాం లేనట్టే !

New Parliament - New Uniform :  నూతన పార్లమెంటు భవనంలోని భద్రతా సిబ్బందికి కొత్త యూనిఫామ్ ను అందుబాటులోకి తెస్తారనే ప్రచారానికి తెరపడింది.

Published By: HashtagU Telugu Desk
New Parliament New Uniform

New Parliament New Uniform

New Parliament – New Uniform :  నూతన పార్లమెంటు భవనంలోని భద్రతా సిబ్బందికి కొత్త యూనిఫామ్ ను అందుబాటులోకి తెస్తారనే ప్రచారానికి తెరపడింది. కొత్త రకం యూనిఫాం తయారీ కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తులలాగా కనిపిస్తున్నాయని భద్రతా సిబ్బంది నుంచి పార్లమెంటు అధికారులకు ఫీడ్ బ్యాక్ అందింది.  ఆ యూనిఫామ్ ను ధరిస్తే ఊపిరి ఆడటం లేదని ఇంకొందరు భద్రతా సిబ్బంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఢిల్లీ నగరంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ దుస్తులను ధరిస్తే చెమట విపరీతంగా కారుతోందని మరికొందరు తెలిపారు.  దీంతో ఈ కొత్త యూనిఫామ్ ను పార్లమెంటు అధికారులు బుధవారం రోజే ఉపసంహరించారు. పార్లమెంటు అంటే సామాన్య ప్రజానీకానికి సంబంధించినది. ఈ యూనిఫాంను చూస్తే సైనికులు ధరించిన డ్రెస్ లాగా ఉందని కొందరు పార్లమెంటు సిబ్బంది చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ.. పార్లమెంటు భద్రతా సిబ్బంది పాత యూనిఫామ్ లోనే (New Parliament – New Uniform) తమ డ్యూటీలను చేయనున్నారు.

Also read : Vivo V29: వివో నుంచి మరో రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్లు..! స్పెసిఫికేషన్ల వివరాలివే..!

  Last Updated: 22 Sep 2023, 01:21 PM IST