Site icon HashtagU Telugu

CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వీ రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల పరువు తీసేలా…ప్రభుత్వాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయన్నారు. ఇది సబబు కాదన్నారు. ఛత్తీస్ గఢ్ కు సంబంధించి ఓ కేసులో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం రమణ సింగ్ పై నమోదైన అవినీతి కేసును కొట్టి వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయంలో త్రిసభ్య ధర్మసనానికి అధ్యక్షత వహిస్తున్న ఆయన సర్కార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్ భార్య యాస్కిన్ సింగ్ లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు అయ్యింది. బీజేపీ సర్కార్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ కేసు విషయాన్ని పక్కనపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానన్యాయమూర్తి ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్సిత్ శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసు ఆర్థిక నేరాల విభాగం 2020 ఫిబ్రవరి 25న FIR నమోదు అయ్యింది. అమన్ సింగ్ అతని భార్యపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరిపించాలని ఉత్సత్ శర్మ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 28న అమన్ సింగ్, అతని భార్యపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. కానీ పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ సంభావ్యతపై ఆధారపడి ఉండటంతో ఏ వ్యక్తినీ విచారించలేమని హైకోర్టు FIR రద్దు చేసింది. అయితే సాహియా శర్మ ఫిర్యాదును సీఎం సమర్ధించారని దీనిపై విచారణ చేపట్టాల్సిందేనని హైకోర్టు తెలిపింది. దీంతో అమన్ సింగ్ పై 2019 నవంబర్ 11న విచారణ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే ఉత్సిత్ శర్మతో తోపాటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.

ఈ సందర్బంగా విచారణ చేపట్టిన సీజే ఎన్వీ రమణ ఈ విషయంలో కలత చెందారు. ఇవాళ కొత్త ట్రెండ్ ప్రారంభం అయ్యింది. కోర్టులో కూడా చూస్తున్నాము. ఇది న్యాయమూర్తుల పరువు తీసేలా ఉంది. ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇది చాలా బాధాకరం అని అన్నారు. వాస్తవానికి ఛత్తీస్ గఢ్ హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ ను న్యాయమూర్తులు మురారి హిమా కోహ్లీలతోకూడిన ధర్మాసనం విచారిస్తున్న సమయంలో జస్టిస్ రమణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Exit mobile version