US Visa rules: అమెరికా వీసాకు కొత్త నిబంధనలు – సోషల్ మీడియా అకౌంట్‌లు పబ్లిక్ చేయాలి, తక్షణమే అమల్లోకి

వీటికి దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ ను పబ్లిక్‌గా మార్చి, దరఖాస్తు సమయంలో సమాచారం అందించాల్సి ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
US Embassy Visa Warning

US Embassy Visa Warning

న్యూఢిల్లీ: (US Visa new rules) అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారతీయ పౌరులు ఎఫ్ (F), ఎం (M), జే (J) తరహా నాన్-ఇమిగ్రెంట్ వీసాలకు దరఖాస్తు చేయాలంటే, తమ సోషల్ మీడియా అకౌంట్‌లను ఇకపై ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కి మార్చాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనను భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

ఈ మార్పు ద్వారా వీసా అప్లికెంట్ల సామాజిక మాధ్యమ కార్యకలాపాలను అమెరికా చట్టాలకు అనుగుణంగా పరిశీలించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రత్యేకించి అకడమిక్ స్టూడెంట్ల కోసం ‘ఎఫ్’ వీసా, వొకేషనల్ స్టూడెంట్లకు ‘ఎం’ వీసా, స్కాలర్స్, రీసెర్చర్లు, ఇంటర్న్లు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ‘జే’ వీసాలు జారీ అవుతాయి.

వీటికి దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ ను పబ్లిక్‌గా మార్చి, దరఖాస్తు సమయంలో సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రొఫైల్ ఎంతకాలం పబ్లిక్‌గా ఉంచాలి అనే విషయంలో యుఎస్ అధికారాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఈ మార్పు ద్వారా వీసా ప్రాసెసింగ్‌లో పారదర్శకత పెరగనుంది. కానీ అభ్యర్థులు తమ గోప్యతపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అనే దానిపై చర్చ మొదలైంది.

  Last Updated: 23 Jun 2025, 11:00 PM IST