Rahul Gandhi : చిక్కుల్లో రాహుల్..ఇస్లాం మతాన్ని అవమానించారంటూ ఏఐఎంఐఎం ఫైర్

కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టడం అంటే..ఇస్లాం మతాన్ని అవమానించినట్లే అని ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫర్హాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - October 5, 2023 / 11:22 AM IST

కాంగ్రెస్ నేత , ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi ) చిక్కుల్లో పడ్డారు. రీసెంట్ గా గోవా (Goa) వెళ్లిన రాహుల్..అక్కడి నుండి ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి..ప్రపంచ జంతు దినోత్సవం సందర్బంగా ఆ కుక్క పిల్లను తల్లి సోనియా (Sonia Gandhi) కు బహుమతిగా ఇచ్చారు. సోనియా కు ఆ కుక్క పిల్ల ఎంతో బాగా నచ్చడం తో దానికి ‘నూరీ’ (Noorie) అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరే సోనియా , రాహుల్ ను వివాదంలో పడేశాయి.

కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టడం అంటే..ఇస్లాం మతాన్ని అవమానించినట్లే అని ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫర్హాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళలను అవమానించినట్లే అని పేర్కొన్నారు. కుక్కకు నూరీ అని పేరు పెట్టడం అంటే ఇస్లాం మతానికి చెందిన లక్షలాది మంది మహిళలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాహుల్‌ తన తల్లి సోనియా కు బహుమతిగా ఇచ్చిన ఈ కుక్కపిల్ల జాక్‌ రస్సెల్‌ జాతికి చెందినది. రాహుల్‌ తన గోవా ట్రిప్పులో ఉన్నప్పుడు షర్వాణి పిత్రే అనే ఆమె తన భర్తతో కలిసి నడుపుతున్న కుక్కల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆ సమయంలో ఆయన నూరీ అనే కుక్క పిల్లను తీసుకుని ప్రత్యేకంగా తల్లికి బహుమతిగా ఇచ్చారు. అతనికి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టమే రాహుల్ లో వివాదంలో పడేసేలా చేసింది. మరి కుక్క పిల్లకు ‘నూరీ’ అనే పేరును మారుస్తారా..? లేదా అనేది చూడాలి.

Read Also : SBI SCO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. రేపే చివరి తేదీ..!