Site icon HashtagU Telugu

Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!

New Oneplus Device Explodes

New Oneplus Device Explodes

ప్రస్తుతం ఫోన్ (Phone) వాడని మనిషే లేడు..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ అయిపోయింది. నిద్ర లేచినదగ్గరి నుండి పడుకునే వరకు అంత ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లోకి చాల సంస్థలు రకరకాల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే అందిస్తుండడంతో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అయితే కొంతమంది ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం..ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటివి చేయడం తో ఫోన్లు సడెన్ గా పేలుతూ..ప్రాణాలు తీస్తున్నాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా పేలిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బైక్‌పై వెళ్తున్న యువకుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ పేలిన (New Oneplus Device Explodes in Pocket) ఘటన బెంగళూర్ (Bengaluru ) లోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ బుధవారం బైక్‌పై వెళ్తూ తన మొబైల్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఒక్కసారిగా పేలింది. పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలుసుకున్న మొబైల్ షో రూమ్.. ప్రసాద్ వైద్యానికి అయ్యే చిన్నచిన్న ఖర్చులను భరిస్తామని, మొబైల్ డబ్బుల్ని తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.

తీవ్రంగా గాయపడిన భాగానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని షోరూం భరించాలని యువకుడి బంధువులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పూర్తిగా డబ్బులు చెల్లించేందుకు షోరూం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : YS Sharmila Joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైస్ షర్మిల