DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ

DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌ వేదికగా స్టార్ట్ కాబోతోంది.

  • Written By:
  • Updated On - January 5, 2024 / 07:05 AM IST

DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌ వేదికగా స్టార్ట్ కాబోతోంది. ఇటీవల రూపొందించిన మూడు క్రిమినల్ కోడ్ చట్టాల అమలు, దేశంలో ఖలిస్థాన్ అనుకూల గ్రూపుల కార్యకలాపాలు, సైబర్ నేరాలు, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో సమీక్షించనున్నారు. జనవరి 6-7 తేదీల్లో ఈ సెషన్‌లలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అత్యున్నత పోలీసు అధికారులతో చిట్‌చాట్ కూడా చేయనున్నారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై చర్చలు జరగడం ఈ సదస్సులోని కీలక ఎజెండా అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల సమావేశాలలోని అనేక సెషన్‌లలో స్వయంగా పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, సైబర్ నేరాలు, మావోయిస్టుల సమస్య, అంతర్ రాష్ట్ర పోలీసుల సమన్వయం తదితర అంశాలు ఈ సమావేశంలో(DGPs Meet) చర్చకు రానున్నాయని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి  డీజీపీ, ఐజీపీ ర్యాంక్‌ కలిగిన దాదాపు 250 మంది అధికారులు హాజరవుతారు.  మరో 200 మందికిపైగా ఇతరులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి ఏడాది జనవరిలో డీజీపీ, ఐజీపీల సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది.  ఈ మీటింగ్ 2014లో గౌహతిలో, 2015లో రాణా ఆఫ్ కచ్‌లో, 2016లో హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో, 2017లో టేకాన్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్ అకాడమీలో, 2019లో పూణేలో, 2020లో వర్చువల్‌గా, 2021లో లక్నోలో హైబ్రిడ్ మోడ్‌లో,  2023 జనవరిలో న్యూఢిల్లీలో జరిగింది. ఇంతకుముందు ఈ సమావేశాల్లో జాతీయ భద్రతా అంశాలపై మాత్రమే చర్చ జరిగేది. ఇప్పుడు నేరాల నివారణ మరియు గుర్తింపు, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలు, పోలీసుల ప్రతిష్టను మెరుగుపరచడం వంటి అంశాలు కూడా ఇందులో(DGPs Meet) భాగమవుతూ వస్తున్నాయి.

Also Read: Ranam 2 : ముందు శ్రీహరి అనారోగ్య సమస్య.. తరువాత ఆర్తి అగర్వాల్ ఇబ్బంది.. ఈ సినిమాకు ఎన్ని కష్టాలో..