New Criminal Laws : బ్రిటిష్ పాలకులు తెచ్చిన భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్) చట్టాలు అమల్లోకి వచ్చాయి. సోమవారం రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో వాటి అమలుకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర సర్కారు అధికారిక నోటిఫికేషన్ జారీ చేయగానే.. వాటి అమలు ప్రక్రియ మొదలవుతుంది. ఈనేపథ్యంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలలోని(New Criminal Laws) ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
- ఈ మూడు క్రిమినల్ కోడ్ బిల్లులు చట్టరూపం దాలిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్‌లైన్ అవుతాయి.
- దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయి.
- చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుంది.
- దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు.
- దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి.
Also Read: Hindu Woman : పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ.. పీపీపీ పార్టీ టికెట్
మూడు క్రిమినల్ కోడ్ చట్టాల స్వరూపం ఇదీ..
- ఇండియన్ పినల్ కోడ్(IPC)లో ఉండే 511 సెక్షన్లు ఉండేవి. దాని స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita)లో ఇప్పుడు 358 సెక్షన్లు ఉంటాయి. సవరించిన ఈ చట్టంలో మొత్తం 20 వరకూ అదనంగా నేరాలను చేర్చారు. వాటిలో 33 సెక్షన్లకు జైలు శిక్షను పెంచారు. 83 నేరాలకు భారీ మొత్తంలో జరిమానా విధించే విధంగా మార్చారు. ఆరు నేరాలకు ఇక కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఉంది.
- క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (CrPC) లోని 484 సెక్షన్లు ఉండేవి. దాని స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (Nagarik Suraksha Sanhita)లో 531 సెక్షన్లు ఉంటాయి. చట్టాన్ని మొత్తం 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు యాడ్ చేశారు. చట్టంలో అవసరం లేని మొత్తం 14 సెక్షన్‌లు తొలగించారు.
- ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 167 ప్రొవిషన్స్ ఉండేవి. దాని స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్యా అధినియం (Bharatiya Sakshya Adhiniyam)లో 170 ప్రొవిషన్స్ ఉంటాయి. మొత్తం 24 సెక్షన్లు సవరించారు. చట్టంలో రెండు కొత్త ప్రొవిషన్స్, ఆరు సబ్ ప్రొవిషన్స్ ప్రవేశపెట్టారు. 6 ప్రొవిషన్స్ ను తొలగించారు.