Site icon HashtagU Telugu

New airbase: పాకిస్తాన్ వ‌ణికేలా భార‌త్‌ వైమానిక బేస్

Cropped (3)

Cropped (3)

భార‌త్, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో కీల‌క‌మైన వైమానిక బేస్ ను కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఆ మేర‌కు వైమానిక స్థావ‌రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేశారు. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వ‌ద్ద కొత్త వైమానిక స్థావరానికి పునాది వేశారు. దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఆవిర్భవించనుందని మోడీ అన్నారు.

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022ను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, దిగుమతి చేసుకోలేని మరో 101 వస్తువుల జాబితాను రక్షణ దళాలు విడుదల చేయనున్నాయని వెల్ల‌డించారు. దీంతో 411 రక్షణ సంబంధిత వస్తువులను స్థానికంగానే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని మోడీ అన్నారు. కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే మొదటిసారి ఇందులో పాల్గొన్న అపూర్వమైన DefExpoగా అభివ‌ర్ణించారు.

ఉత్తర గుజరాత్‌లోని బనస్‌కాంతలోని దీసా వద్ద ఎయిర్‌బేస్ ఏర్పాటు చేయడం వల్ల దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా అవతరించనుందని మోడీ అన్నారు. గత కొన్నేళ్లలో భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని కూడా ఆయన చెప్పారు.”ఇంతకుముందు పావురాలను వదులుతున్నాం, ఇప్పుడు చిరుతలను వదులుతున్నాం” అని దేశం చాలా ముందుకు వచ్చింద‌ని అన్నారు.