Site icon HashtagU Telugu

PM Modi: మోదీ న‌వ్వుల పాల్.. ప్ర‌ధాని కొంప‌ముంచిన‌ ఫొటో..!

Pm Narendra Modi Tributes To Babu Jagjivan Ram Ji

Pm Narendra Modi Tributes To Babu Jagjivan Ram Ji

దేశ రాజ‌కీయ నాయ‌కుల్లో ప‌బ్లిసిటీ పిచ్చి ఉన్నవారిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముందుంటారు. సిట్యువేష‌న్ ఏదైనా ప‌బ్లిసిటీలో మోదీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఈ క్ర‌మంలో ప్రతి విషయాన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేయటం అల‌వాటు అయిన మోదీ పై ఒక్కోసారి ప్ర‌శంస‌లుతో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తుంటాయి. ప‌బ్లిసిటీలో భాగంగా మోదీ చేసే కొన్ని ట్వీట్లు బూమ్ రాంగ్ అవుతుంటాయి. దీంతో మోదీకి నెటిజ‌న్లు చివాట్లు పెట్టా ష‌రా మామూలుగా మారిపోయింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంట‌గే.. ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్ జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ట్విట్టర్‌లో ఒక ఫోటోని షేర్ చేశాడు. దానికి సంబంధించి మంచి ఎమోషనల్ కొటేషన్ కూడా పెట్టాడు.
జాతి మిమ్మల్ని ఎల్లవేళలా గుర్తుంచుకుంటుంది.. మిమ్మల్ని ఎప్ప‌టికీ దేశం మరిచిపోదంటూ ఎమోష‌న్‌గా భారీ డైలాగే కొట్టాడు మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ. అయితే ఇప్పుడు ఆ పోస్టే మోడీని నవ్వుల పాలు చేసింది.

ఆ ఫొటోలో న‌రేంద్ర మోదీ జగ్జీవన్ రామ్‌కి దండం పెట్టుకుంటుండగా.. ఆయన వెనుకాల దివంగత అరుణ్ జైట్లీ, రామ్ నాయక్‌లు ఇద్దరు ఫొటోలో ఉన్నారు. చనిపోయిన వారితో మోడీ కలిసి వచ్చి బాబూ జగ్ జీవన్ రామ్‌కి నివాళులు అర్పిస్తున్నట్టుగా ఈ ఫోటీలో ఉంటుంది. మోదీకి రెండు క‌ళ్ళు ఉంటే, దేశ వ్యాప్తంగా ఆయ‌న్ని ట్విట్ట‌ర్‌లో ఫాలో అయ్యే వారికి ఎన్నిక‌ళ్ళు, అక్క‌డే ప్ర‌ధాని మోదీజీ అడ్డంగా దొరికిపోయాడు.

దీంతో మోదీనీ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అసలు చనిపోయిన వ్యక్తులని శ్రద్ధాంజలికి తీసుకొని రావటం ఏంటని, ప్ర‌ముఖుల‌కు నివాళులు అర్పించేందుకు, ప్ర‌ధాని మోదీ వెనుకాల అరుణ్ జైట్లీ ఆత్మా ఎదురుచూస్తుంది అంటూ ఫన్నీ ట్రోల్స్ చేస్తూ మోదీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ ఫోటోలు పెట్టేముందు క్రాస్ చెక్ చేసుకోవాలని మోడీకి కౌంటర్స్ ఇస్తున్నారు. పబ్లిసిటీ కోసం పాకులాడటం కాదు నిజాయితీగా ఉండ‌డం నేర్చుకోవాలంటూ ప్ర‌ధాని మోదీకి నెటిజన్స్ క్లాస్ పీకుతున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది.

Exit mobile version