India Vs Nepal : భారత్ వర్సెస్ నేపాల్.. నేపాల్ 100 కరెన్సీ నోటుపై దుమారం.. ఎందుకు ?

India Vs Nepal : నేపాల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 నోటుపై దుమారం రేగుతోంది.

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 10:57 AM IST

India Vs Nepal : నేపాల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 నోటుపై దుమారం రేగుతోంది. ఆ కరెన్సీ నోటులో ముద్రించిన నేపాల్ మ్యాప్‌లో భారత్‌‌కు చెందిన మూడు వివాదాస్పద ప్రాంతాల్ని చేర్చడం విమర్శలకు దారితీసింది.  ఆ వివాదాస్పద ప్రాంతాల పేర్లే.. లిపులేఖ్‌, లింపియదుర, కాలాపానీ. 370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని లిపులేఖ్‌ – లింపియదుర – కాలాపానీ ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని భారత్ చెబుతోంది. కానీ నేపాల్ (India Vs Nepal) మరో రకంగా వాదిస్తోంది. వివరాలు తెలియాలంటే మనం హిస్టరీలోకి వెళ్లాలి.

We’re now on WhatsApp. Click to Join

  • భారత్‌లోని సిక్కిం, వెస్ట్ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ దేశం సరిహద్దు‌ను పంచుకుంటోంది.
  • నేపాల్ మ్యాప్‌లోని ప్రాంతాలకు సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. బ్రిటీష్ కాలం నాటిది.
  • ఆంగ్లో -నేపాల్ యుద్ధంలో నేపాల్ ఓడిపోయింది. దీంతో ఆంగ్లేయులు, నేపాలీల మధ్య 1816లో సుగౌలీ సంధి జరిగింది. ఇందులో భాగంగా కాళీ నది, రప్తీ నది మధ్యలో ఉన్న భూభాగాల్ని బ్రిటీష్ వాళ్లకు నేపాల్ అప్పగించింది.
  • సుగౌలీ సంధిలోని  కొన్ని నిబంధనల ప్రకారం కాలాపానీ, లిపులేఖ్, లింపియదుర ప్రాంతాల్ని తిరిగి తమకు అప్పగించాలని నేపాల్ వాదిస్తోంది.
  • ఈ మూడు ప్రాంతాలున్న భూభాగం అటు భారత్‌కి,ఇటు నేపాల్‌కి వ్యూహాత్మకంగా కీలకమైనది. భారత్‌, నేపాల్, చైనాకు ఇది ట్రై జంక్షన్ లాంటిది.
  • 1962లో చైనాతో యుద్ధం చేసిన సమయంలో భారత ఆర్మీ  కాలాపానీ, లిపులేఖ్, లింపియదుర ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు నిర్మించింది.
  • నేటికీ లిపులేఖ్‌లో భారత పోలీస్ పోస్ట్ యాక్టివ్‌గానే ఉంది.
  • కాలాపానీ ఏరియాలో మాత్రం భారత సైన్యం ఉనికి లేదు.

Also Read :MLC Kavitha : కవిత‌కు బెయిల్‌పై ఉత్కంఠ.. కాసేపట్లో తీర్పు

  • లింపియదుర, లిపులేఖ్ నుంచి కాళీ నది పుట్టిందని.. ఆ రెండు ప్రాంతాలు నేపాల్‌లోని ధర్చుల జిల్లా పరిధిలోనే ఉన్నాయని నేపాల్ సర్కారు వాదిస్తోంది.
  • 1962లో చైనాతో యుద్ధం ముగిసిన తరవాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నేపాల్ రాజు కింగ్ మహేంద్ర కాలాపానీ ప్రాంతాన్ని భారత్‌‌కు అప్పగించారని నేపాల్ సర్కారు అంటోది.
  • లింపియదుర, లిపులేఖ్‌ తమవే అని నేపాల్ వాదించడాన్ని భారత్ తప్పుబడుతోంది. తాము ఒప్పందాల  ప్రకారమే నడుచుకుంటున్నామని తేల్చి చెబుతోంది.
  • కాళీ నదికి పశ్చిమ భాగంలోని సుస్తా ప్రాంతాన్ని భారత్ ఆక్రమించుకుందని నేపాల్  వాదిస్తోంది.

Also Read :Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్

  • 1981లో భారత్ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ ఉన్నారు. అప్పుడే నేపాల్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జాయింట్ టెక్నికల్ కమిటీని నియమించారు
  • ఈకమిటీ  చొరవతో దాదాపు 97 శాతం సరిహద్దు సమస్యలు పరిష్కారమైనా మిగతా 3 శాతం మాత్రం అలాగే ఉండిపోయాయి.
  • నేపాల్‌లో చైనా అనుకూల రాజకీయ వర్గం ఇప్పటికే భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఈక్రమంలోనే నేపాల్ 2020లో కొత్త మ్యాప్‌ని ముద్రించింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ హయాంలోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు పుష్ప కుమార్ దహల్ హయాంలో ఈ వివాదం ముదిరేలా కనిపిస్తోంది.