NEET UG Counselling: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ (NEET UG Counselling) ప్రక్రియను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తిస్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు mcc.nic.in పోర్టల్‌పై నిఘా ఉంచాలని అధికారులు సూచించారు. ఈ కౌన్సెలింగ్ సెషన్‌లో అర్హత పొందిన అభ్యర్థులు తమ ఇష్టపడే కోర్సు, కళాశాల ఎంపికను నమోదు చేసుకోవాలి. వివరాలను అందించాలి. దీని తర్వాత అభ్యర్థులు అవసరమైన రుసుమును డిపాజిట్ చేయాలి. అభ్యర్థుల ఎంపిక, వారి నీట్ 2023 ర్యాంక్, సీట్ల లభ్యత, రిజర్వేషన్ ప్రమాణాల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం ఈ పత్రాలు అవసరం
– నీట్ 2023 అడ్మిట్ కార్డ్
– నీట్ స్కోర్‌కార్డ్ లేదా ర్యాంక్ లెటర్
– 10వ తరగతి మార్క్ షీట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
– 12వ తరగతి మార్క్ షీట్ (ఇంటర్ సర్టిఫికెట్)
– ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటివి)
– ఎనిమిది పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
– తాత్కాలిక కేటాయింపు లేఖ
– కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
– PWD సర్టిఫికేట్ (వర్తిస్తే)
Also Read: PM Modi Gifted Biden: జో బిడెన్‌కి ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి ఎందుకు ఇచ్చారో తెలుసా.. కారణమిదే..?
నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు ఈ విధంగా దరఖాస్తు చేయాలి
ముందుగా అభ్యర్థులు mcc.nic.inలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తర్వాత హోమ్ పేజీలో “ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీ NEET రోల్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయండి. ఇప్పుడు మీ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, వ్యక్తిగత సమాచారం, విద్యా వివరాలు, NEET ఫలితాల వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను పూరించండి. ఇప్పుడు నిర్ణీత రుసుమును చెల్లించి, మీ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించండి.