NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్

నీట్‌ పరీక్షలో రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్‌ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.

Published By: HashtagU Telugu Desk
NEET 2024

NEET 2024

NEET 2024: నీట్‌ పరీక్షలో రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్‌ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు నిరసన తెలిపారు.

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థి మాట్లాడుతూ.. రెండో ప్రయత్నంలో 620 మార్కులు సాధించానని చెప్పాడు. నీట్ పరీక్ష ముందే లీక్ అయిందని, పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నదే మా డిమాండ్, ఈ పరీక్షతో మాకు సంతృప్తి లేదు. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సీబీఐ విచారణకు ఆదేశించిందని ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు.

నీట్ మళ్లీ నిర్వహించాలని కోరుతున్నామని హర్ష్ దూబే అనే మరో విద్యార్థి అన్నారు. పరీక్ష అమలులో తప్పులు జరిగాయని, అందుకే ఎన్టీఏ డీజీని తొలగించారని, దర్యాప్తును సీబీఐకి అప్పగించారని మండిపడ్డాడు. పరీక్షలో రిగ్గింగ్ జరగకపోతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటోందఐ ప్రశ్నించాడు. దర్యాప్తును ముందుగానే సీబీఐకి అప్పగించి ఉండవచ్చు, దర్యాప్తును ఆలస్యం చేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేయడానికి నిందితులకు సమయం ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా మళ్లీ పరీక్ష నిర్వహించాలన్నదే మా డిమాండ్ అని అన్నాడు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని, అందుకే ఈరోజు మళ్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చామన్నారు. ఇంతకు ముందు కూడా మేం ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని ఇంతకు ముందు చేసి ఉండాల్సింది. సీబీఐ విచారణపై మాకు నమ్మకం లేదని, మళ్లీ పరీక్ష నిర్వహించాలన్నదేనని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: journalist Muralidhar Reddy: సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

  Last Updated: 23 Jun 2024, 04:49 PM IST