Site icon HashtagU Telugu

NEET Toppers : ఆరుగురు ‘నీట్’ టాపర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త అప్‌డేట్ ఇదీ

NEET PG 2024 Exam Date

NEET PG 2024 Exam Date

NEET Toppers : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’‌పై దుమారం రేగుతోంది. ఈ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకైందని.. ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులకు తప్పుడు ప్రశ్న పత్రాలను ఇచ్చి టైం వేస్టు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై బిహార్ సహా పలు రాష్ట్రాల్లో వేగవంతంగా దర్యాప్తు జరుగుతోంది.  ఈవిధంగా తప్పుడు ప్రశ్న పత్రాలు తీసుకున్న విద్యార్థులకు కొంత టైం వేస్టు అయింది. దీంతో వారికి మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో గ్రేస్ మార్కులను కలిపాారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో వాటిని తొలగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఆరోపణల నేపథ్యంలో నీట్(NEET Toppers) పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది అభ్యర్థుల మార్కులను మళ్లీ లెక్కిస్తున్నారు. ఈ 67 మందిలో ఆరుగురికి గతంలో గ్రేస్ మార్కులు కలిశాయి. వాటిని ఆ ఆరుగురి స్కోరు నుంచి తగ్గించనున్నారు. ఫలితంగా ఆయా విద్యార్థుల నీట్ స్కోరు దాదాపు 60 నుంచి 70 పాయింట్లు తగ్గిపోతుంది.  ఫలితంగా వారి ర్యాంకులు కూడా మారిపోతాయి. ఈ ఆరుగురు విద్యార్థులు కూడా హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాశారని సమాచారం. గ్రేస్ మార్కులు కోల్పోనున్న 1563  మంది అభ్యర్థులంతా జూన్ 23 మళ్లీ నీట్ పరీక్షకు హాజరుకావచ్చు. జూన్ 30న రిజల్ట్ విడుదల చేస్తారు. ఇక జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది.

ఇక నీట్ పరీక్షల వ్యవహారంపై జూలై 8న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.  బిహార్‌, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పేపర్ లీక్ వల్ల చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందని చెబుతున్నారు.  నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తేనే అసలు ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుందని, వారికి సీట్లు వస్తాయని పరిశీలకులు సూచిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా దీనిపై నిరసన గళం వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందేందుకు 650 లేదా అంతకంటే ఎక్కువ నీట్ స్కోర్ అవసరం. అగ్రశ్రేణి మెడికల్ కాలేజీలలో సీటు కావాలంటే 690కిపైనే  కంటే ఎక్కువ నీట్ స్కోర్లు అవసరం.

Also Read : Pawan First Signature : డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రెండు కీలక ఫైల్స్ ఫై సంతకం..