Neeraj Chopra: తొలి పారిస్ డైమండ్ లీగ్ టైటిల్‌ కైవసం చేసుకున్న నీరజ్

ఒలింపిక్ పతక విజేత మరియు జావెలిన్ త్రో అగ్రతార నీరజ్ చోప్రా మరోసారి భారత క్రీడా గర్వంగా నిలిచాడు.

Published By: HashtagU Telugu Desk
Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra : ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి భారత క్రీడా గర్వంగా నిలిచాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత, 2024 పారిస్ డైమండ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను గెలుచుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ పోటీలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను తక్కువ దూరంతోనే గెలిచిన నీరజ్, తన మొదటి త్రోతోనే విజయం సాధించాడు.

27 ఏళ్ల నీరజ్ తన మొదటి రౌండ్ త్రోలోనే 88.16 మీటర్లు నమోదు చేస్తూ ముందు నిలిచాడు. తర్వాతి త్రోలో 85.10 మీటర్లు, మూడవ నుంచి ఐదవ త్రోలు ఫౌల్స్ కాగా, ఆఖరి రౌండ్‌లో 82.89 మీటర్లు త్రో చేశాడు. జూలియన్ వెబర్ 87.88 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్‌కు చెందిన లూయిజ్ మౌరిసియో డా సిల్వా 86.62 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

2022లో జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో 88.44 మీటర్ల త్రోతో తన మొదటి టైటిల్‌ను గెలుచుకున్న నీరజ్, ఇప్పుడు మళ్లీ అదే రోజున, రెండేళ్ల తర్వాత టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. గతంలో బ్రుసెల్స్ ఫైనల్లో 87.86 మీటర్ల త్రోతో కేవలం 1 సెం.మీ తేడాతో రెండో స్థానంలో నిలిచిన అతని పట్టుదల ఇప్పుడు విజయాన్ని తెచ్చిపెట్టింది.

నీరజ్ చోప్రా టాప్ 5 జావెలిన్ త్రోలు (2022–2025)

90.23 మీ: దోహా డైమండ్ లీగ్, మే 16, 2025 (జాతీయ రికార్డు)

89.94 మీ: స్టాక్‌హోమ్, జూన్ 30, 2022

89.49 మీ: లాసాన్, ఆగస్ట్ 2024

89.45 మీ: పారిస్ ఒలింపిక్స్ ఫైనల్, ఆగస్ట్ 2024 (సిల్వర్ మెడల్)

89.34 మీ: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్, ఆగస్ట్ 2024

ఈ ప్రదర్శనలు నీరజ్ స్థిరమైన శ్రమ, నిబద్ధతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. క్రీడాభిమానులు అతడిని 90 మీటర్ల మైలురాయిని తిరిగి అధిగమించాలనే ఆకాంక్షతో చూస్తున్నారు.

Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్

  Last Updated: 21 Jun 2025, 11:03 AM IST