Site icon HashtagU Telugu

vultures dead: రాబందులు రాలిపోతున్నాయి!

Vultures

Vultures

అస్సాంలోని కమ్రూప్ జిల్లాలోని ఛాయ్‌గావ్ ప్రాంతంలో దాదాపు 100 రాబందులు చనిపోయాయి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఛాయ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలాన్‌పూర్ ప్రాంతంలో సుమారు 100 రాబందుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. రాబందులు మేక కళేబరాన్ని తిన్నాయని, విషపూరితమైన ఆహారం తినడం వల్లే రాబందులు చనిపోయాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కమ్రూప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) డింపి బోరా మాట్లాడుతూ.. ఒకేసారి దాదాపు 100 రాబందులు చనిపోవడం ఇది మొదటిసారి అని చెప్పారు. “రాబందుల కళేబరాల దగ్గర మేక ఎముకలు కొన్ని దొరికాయి.

విషపూరితమైన మేక కళేబరాన్ని తిని రాబందులు చనిపోయాయని అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కారణాలు వెల్లడికానున్నాయి. మేక కళేబరంలో విషం కలిపిన వ్యక్తిని అరెస్ట్ చేస్తాం” అని బోరా తెలిపారు. “ఈ ప్రాంతంలో ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది, కానీ ఈసారి పెద్ద సంఖ్యలో రాబందులు చనిపోయాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.

 

Exit mobile version