Site icon HashtagU Telugu

Floods: నెలలు నిండిన నా భార్యను కాపాడండి అంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త?

C006afe0 B4aa 40bf Ad7c 9984bb6d3add

C006afe0 B4aa 40bf Ad7c 9984bb6d3add

ప్రస్తుతం అస్సాంలో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు,వీధులు అన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా వానలు కురుస్తూ ఉండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి అంతే కాకుండా కనీసం తాగడానికి కూడా నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే వరద బాధితులలో ఒక వ్యక్తి తన భార్య కడుపుతో ఉందని భార్యను కాపాడుకునేందుకు హెల్ప్ చేయమంటూ ముఖ్యమంత్రికి మెయిల్ చేశాడు. దయచేసి 9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి అంటూ వేడుకున్నాడు. ఆ వ్యక్తి మెయిల్ మేరకు స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. అస్సాం రాష్ట్రాలు సిల్చార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బరాక్ నది వెంబడి ఉన్న బేతుకండి కరకట్ట వద్ద తెగిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీనితో రాత్రికి రాత్రే పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

రంగీర్ ఖారీ కనక్ పూర్ రోడ్ రాధామాధవ్ బునియాడి పాఠశాల స్కూల్ సమీప ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. ఆ ప్రాంతంలో ఉంటున్న నిరుపమ్ దత్త పురక్యస్థ అనే వ్యక్తి భార్య తొమ్మిది నెలల గర్భంతో ఉందని, వరద నీరు ఉంచడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే కడుపుతో ఉన్న భార్యను రక్షించేందుకు నిరుపమ్ ఎన్నో రకాలుగా ఆలోచించిన ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి మెయిల్ చేశాడు. దయచేసి నా తొమ్మిది నెలల గర్భిణీ భార్యకు సహాయం చేసే రక్షించండి. పరిస్థితి విషమంగా ఉంది తాగడానికి కనీసం నీరు కూడా లేదు. ఒక రెస్క్యూ బోర్డు ఏర్పాటు చేయండి అంటూ వేడుకున్నాడు. వెంటనే ఆ విషయంపై స్పందించి అక్కడి సిబ్బంది చేరుకొని ఆమెను పదవిలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.