Site icon HashtagU Telugu

NCP MP Supriya: ఎంపీకి తప్పిన పెను ప్రమాదం.. చీరకు అంటుకున్న నిప్పు..!(వీడియో)

Resizeimagesize (1280 X 720) (2) 11zon

NCP MP

మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే‌కు (NCP MP Supriya) పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన సమయంలో ఆమె చీరకు నిప్పు అంటుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమె పూణెలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే సకాలంలో మంటలు ఆర్పివేయడంతో ఎంపీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎంపీ చీరకు మంటలు అంటుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం సుప్రియా సూలే జ్యోతి ప్రజ్వలన చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు. అయితే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో సుప్రియా సూలేకి ఎలాంటి గాయాలు కాలేదు. చీరకు మంటలు అంటుకున్నాయని తెలిసిన వెంటనే స్థానికులు మంటల్ని ఆర్పివేశారు. ఎంపీ సుప్రియా సూలే పూణె పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలోని హింజేవాడిలో ఏర్పాటు చేసిన కరాటే టోర్నీ ప్రారంభోత్సవానికి సుప్రియా సూలే హాజరయ్యారు. ఈ క్రమంలో దీపం వెలిగిస్తున్న సమయంలో ఎంపీ చీరకు మంటలు అంటుకున్నాయి. అయితే సకాలంలో దృష్టి సారించడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: India vs Sri Lanka: శతకొట్టిన కోహ్లీ, గిల్.. లంక ముందు భారీ లక్ష్యం..!

ప్రమాదం జరిగిన తర్వాత సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. “నా శ్రేయోభిలాషులు, పౌరులు, కార్మికులు, అధికారులకు నా అభ్యర్థన ఏమిటంటే.. నేను సురక్షితంగా ఉన్నాను. దయచేసి ఏ విధంగానూ ఆందోళన చెందవద్దు. మీరు చూపుతున్న ప్రేమ, శ్రద్ధ నాకు వెలకట్టలేనిది.” అందరికీ సుప్రియా సూలే కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత కూడా సుప్రియా సూలే ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించే బదులు అక్కడే ఉండటానికి ఇష్టపడింది. దీంతో పాటు పగటిపూట ఎంపీ సులే ముందస్తుగా అనుకున్న కార్యక్రమాలన్నీ యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తరువాత తదుపరి కార్యక్రమంలో సుప్రియా సూలే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతరులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తర్వాత సుప్రియా సూలే కాలిన చీర కట్టుకుని తదుపరి కార్యక్రమానికి వెళ్లిపోయింది.