Naxalite Bandh: జులై 25న నక్సలైట్లు బంద్‌ కు పిలుపు

నక్సలైట్ వివేక్ భార్య జయ ధన్‌బాద్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. జయ క్యాన్సర్‌తో బాధపడుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ధన్‌బాద్‌లో చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని జయ దీదీతో పాటు డాక్టర్, శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు

Naxalite Bandh: జూలై 25న జార్ఖండ్-బీహార్‌లో నక్సలైట్లు బంద్ ప్రకటించారు. మహిళా నక్సలైట్ జయ దీదీ అరెస్టుకు సంబంధించి ఈ ప్రకటన వెలువడింది. జయ దీదీ భర్త వివేక్ పై ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. అయితే ఆయన భార్యను అరెస్టు చేయడంతో నిరసనగా ఈ బంద్‌ను ప్రకటించారు.

నక్సలైట్ వివేక్ భార్య జయ ధన్‌బాద్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. జయ క్యాన్సర్‌తో బాధపడుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ధన్‌బాద్‌లో చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని జయ దీదీతో పాటు డాక్టర్, శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు జరుపుకోవాలని నక్సలైట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి కరైకెలా పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లు పోస్టర్లు కూడా వేశారు. ఈ పోస్టర్‌తో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

జార్ఖండ్-బీహార్ లో జూలై 25న బంద్:
సీపీఐ మావోయిస్టు నక్సలైట్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అర్థరాత్రి కారైకెలా పోలీస్ స్టేషన్‌లోని ఓటర్ పంచాయతీ సమీపంలో బ్యానర్‌ను కట్టారు. దీంతో పాటు బుక్‌లెట్‌ను కూడా నక్సలైట్లు అక్కడే వదిలేశారు. దీంతో గ్రామంలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోస్టర్‌, బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోస్టర్‌పై ఏం రాసి ఉందంటే?

నక్సలైట్లు ఏర్పాటు చేసిన పోస్టర్‌పై 2024 జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో మహిళా నక్సలైట్ జయ దీదీకి సంబంధించి నక్సలైట్లు ఆమెను అరెస్టు చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. జయ దీదీని హత్య చేయాలనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేశారని ఫైర్ ఆయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలనీ పేర్కొన్నారు.

Also Read: Rat Fever : మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే చికిత్స పొందండి.!

Follow us