Encounter : భారీ ఎన్​కౌంటర్..నలుగురు మావోయిస్టులు హతం

Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. on WhatsApp. Click to Join. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్‌.. పోలీసులపై […]

Published By: HashtagU Telugu Desk
Encounters

Encounters

Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది.

on WhatsApp. Click to Join.

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్‌.. పోలీసులపై కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read Also: Mysuru Maharaja : ఎన్నికల బరిలో మైసూర్ మహారాజా.. కారు, ఇల్లు కూడా లేవట!

మరోవైపు, బీజాపుర్​తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్​ ప్రాంతంలో ఈ ఏడాది భద్రతా దళాలు జరిపిన ఎన్​కౌంటర్లలో మృతిచెందిన నక్సలైట్ల సంఖ్య 34కు చేరింది. బీజాపుర్​ జిల్లా, బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది.

  Last Updated: 02 Apr 2024, 10:32 AM IST