Site icon HashtagU Telugu

Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా

Naxalism must be eradicated by 2026.. Amit Shah

Naxalism must be eradicated by 2026.. Amit Shah

Naxalism : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని కీలక ప్రకటన చేశారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో కీలక వాఖ్యలు చేసిన అమిత్ షా … అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలని ఆదేశించారు. వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని..2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామని ప్రకటించారు.

Read Also: Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్

జవాన్ల కోసం 12 హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలు వదిలి ప్రజల్లోకి రావాలని కోరారు. దేశ అభివృద్ధి లో భాగస్వాములు కావాలి… నక్సలిజం వల్ల ఉపయోగం లేదని వెల్లడించారు. ఏపీ ,తెలంగాణ, మహారాష్ట్ర వామపక్ష ఉగ్రవాద నిర్ములనకు మంచి నిర్ణయాలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు అమిత్ షా. 2014-24 వరకు వామపక్ష తీవ్రవాద ప్రబావిత ప్రాంతాల్లో 3006 కోట్లు ఖర్చు చేసామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Read Also: Delhi : పండుగల వేళ ఉగ్రదాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్..!