Nawazuddin Siddiqui:బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో, అక్షత్ అజయ్ తెరకెక్కిస్తున్న సినిమా హడ్డీ. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో జీ స్టూడియోస్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తోన్నారు. అయితే ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ విభిన్న పాత్రలో కవిపించనున్నాడు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో ఈ సినిమాలో నాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు.
ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్దిఖీకు మేక్‌ఓవర్ కోసం చాలా టైమ్ పట్టినట్లు సినిమా యూనిట్ చెబుతోంది. మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్దిఖీ చాలా కష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం దాదాపు మూడు గంటలు మేకప్ కోసం టైమ్ పడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ఈ మేకింగ్ వీడియోలో నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రాన్స్‌జెండర్ పాత్రలో కొత్తగా కనిపించాడు. ఈ లుక్ విభిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర మేకప్ కోసం దాదాపు మూడు గంటల పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ కూర్చీలోనే కూర్చోని ఉన్నాడని సినిమా యూనిట్ చెబుతోంది. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం చాలా శ్రమించాడని చెబుతున్నారు.
ఈ మేకింగ్ వీడియోపై నవాజుద్దీన్ సిద్దిఖీ స్పందించాడు. తాను మేకప్ కోసం మూడు గంటల పాటు కుర్చీలో కూర్చోవడం ఇది తొలిసారి అని, ఈ కొత్త లుక్ తనకు శక్తినిచ్చిందని తెలిపారు. ప్రేక్షకులు ఈ లుక్‌పై ఎలా స్పందిస్తారో చూసేందుకు తాను ఇక వేచి ఉండలేనంటూ నవాజనుద్దీన్ సిద్దిఖీ తెలిపాడు.అచ్చం ట్రాన్స్‌జెండర్‌గానే కనిపించేలా నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్ ఉంది. బయట ట్రాన్స్‌జెండర్లు ఎలా ఉంటారో.. సేమ్ అలాగే ఆయన లుక్ ఉంది.ఈ పాత్ర నవాజుద్దీన్ సిద్దిఖీకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ సినిమా విడుదల కోసం సినియా యూనిట్ వేచి చూస్తోంది. వినూత్న పాత్రలో నటించడంతో ఈసినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.